Archive for February, 2007

బాపు గీసిన చిత్రాలు

February 14, 2007

మీ కోసం కొన్ని బాపు గీసిన చిత్రాలను సమకూర్చి ఇక్కడ ఇస్తున్నాను, చూసి అనందించండి!
BM1
Bapu Bomma1
BM2
BM3
BM4
BM5
BM6
bm7
bm8
bm9

మరిన్ని బొమ్మల కొసం ఈ క్రింది సైట్స్ లో చూడండి,
తెలుగు ఒన్
బాపు బొమ్మలు
జియొసిటీస్
ఫ్లోట్ శాం

బాపు గారి చిత్రాలని కొనాలనుకుంటున్నారా?, అయితె ఈ సైట్ కి వెల్లండి…
ఇండియ

అద్భుతంగ ఉందండి ఈ వీడియొ, చూడండి(పేపర్ ఫైటింగ్)!

February 10, 2007

మనిషన్నాక కాస్త కళాపొషన ఉండాలి!

February 10, 2007

మనిషన్నాక కాస్త కళాపొషన ఉండాలి! ఏమంటరు, కాదంటారా? అయితె ఈ వీడియొ చూసి తరవాత చెప్పండి

మహాభారతం,రామాయణం

February 8, 2007

మహాభారతం మరియు రామాయణం మనకు మాత్రమే సొంతమైన అద్భుతమైన సంపద, ఏమంటారు?
వాటిని చదివిన పుణ్యమే,విన్నా పుణ్యమే! మీరు వినాలనుకుంటే,ఇధిగో ఈ సైట్ కి వెళ్ళండి…
వినండి ఇక్కడ

సినిమ అనుభవం!

February 7, 2007

సినిమాకు వెళ్ళేముందు :

సినిమా ఇంటెర్వల్ వరకు :

ఇంటెర్వల్ నుంచి శుభం వరకు :

సినిమా నుంచి బయటకు వస్తూ :

ఇంటికి వచ్చి సినిమా బావుంటుంది వెళ్ళు అన్నవాడిని

ఇది జరిగిన మరుసటి రోజు సినిమా హాలు వాడు :

పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు.

February 6, 2007

ఈ మధ్య ఒక సైట్లొ ఈ పొస్ట్ చూశానండి, మీకు తెలియజేస్తే బావుంటుండి అని అనిపించింది…….
పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు.

తెలుసుకుందామా.ఇది పెళ్ళయినవాళ్ళకి,పెళ్ళికాబోయేవాళ్ళకి

ఉపయోగకరము.చూద్దామా సంగతేంటో.

బొటనవేలు-తల్లితండ్రులకు ప్రతినిధి
చూపుడువేలు-తోబుట్టువులకు ప్రతినిధి
మధ్యవేలు-మనకోసం
ఉంగరంవేలు-జీవితభాగస్వామికి ప్రతినిధి
చిటికెనవేలు-పిల్లలకు ప్రతినిధి

ఆసక్తిగా ఉందికదా……..

marraige-ring.jpg

ఈ  విధంగా చేయండి.రెండు అర చేతులను తెరచి,మధ్య వేళ్లు

రెండూ మడిచి వెనకవైపునుండి దగ్గరగా పెట్టండి.ఇప్పుడు

మిగతా వేళ్లన్ని చివరలు కలిపి ఉంచండి.

మొదట బొటన వేళ్లు విడదీసి చూడండి.అవి విడిపోతాయి.

అంటే మానవులందరూ ఎదో ఒక రోజు చనిపోతారు.అలాగే

మన తల్లితండ్రులు కూడా మనల్ని వదలి వెళతారు.
ఇప్పుడు బొటన వేళ్లు కలిపి రెండో వేళ్లు విడదీయండి. అవి

కూడా విడిపోతాయి. అంటే మన తోబుట్టువులు కూడా వాళ్ల

 సంసారాలలో తలమునకలై ఉండి మనతో ఉండరు.
ఇప్పుడు రెండో వేళ్లు కూడా కలిపి చిటికెన వేళ్లు విడదీయండి.

అవి విడిపోతాయి. అంటే మన పిల్లలు కూడా తమ స్వంత

జీవితాలకోసం మనల్ని వదలి వెళతారు.

ఇక చిటికెన వేళ్లు కూడా కలిపి నాలుగో వేళ్లు విడదీయండి.

 ఆశ్చర్యం! ఇది నిజం అవి విడిపోవు.ప్రయత్నించినా మిగతా

వేళ్లు కలిసే ఉండాలి. ఎందుకంటే ఆ నాలుగో వేళ్లు భార్యా

 భర్తల బంధానికి,ప్రేమకు ప్రతినిధులు. జీవితాంతం కలిసే

 వుండాలని పెళ్లి ఉంగరాలను ఆ నాలుగో వేలికి తొడుగుతారు.

 అందుకే నాలుగో వేలిని ఉంగరపువేలు అని అంటారు.

ప్రయత్నించి చూడండి.

తప్పక చూడవలసిన మిమిక్రి ప్రోగ్రాం

February 5, 2007

చక్కటి ఈ మిమిక్రి ప్రోగ్రాం చూసి ఆనందించండి

బ్రహ్మకడిగిన పాదమూ…

February 4, 2007

 ఏడుకొండలవాడా… వెంకటేశా!

బ్రహ్మే కడిగిన ఈ పాదాలని దర్శించాలన్నా,పూజ చేసుకొవలన్నా రాసి పెట్టుండలి….
ఆ వైకుంట మాధవుని దర్శనమైన, ప్రసాదమైన లభించాలంటె పూర్వ జన్మ లొ పుణ్యం చేసికొనుండాలి…ఏమంటారు

బ్రహ్మకడిగిన పాదమూ…

చెడ్దవాలకు కూడ మంచి చెయ్యండి

February 4, 2007

చెడ్దవాలకు కూడ మంచి చెయ్యండి

రామాయణంలో మందర పాత్ర గురించి తెలియని వారుండరు. కైకేయి చెలికత్తెగా రాముడిని వనవాసానికి పంపేందుకు సూత్రధారిగా నిలిచింది ఈ మందరే. ఆ పాపంతో తర్వాతి జన్మలో గూనితో మధురానగరిలో పుట్టింది మందర.

అంతేకాదు యౌవ్వనంలోనే ముసలి ముఖం కలిగినదిగా కన్పిస్తూ మధురానగరిని ఏలిన కంసుడి ఆస్థానంలో ఆయన సేవకురాలిగా నియమితురాలైంది. ప్రతి రోజా కంసుడి ఛాతీకి గంధంతో మర్ధనం చేయడం ఆమె పని.

అయితే కంసుడి కిరాతకం రోజురోజుకూ పెరుగుతుండటంతో అతడ్ని చంపేందుకు తన సోదరుడు బలరాముడితో పాటు మధురానగరి వచ్చాడు శ్రీకృష్ణుడు. మధురానగరిలో వస్తుండగా ఆయనను మందర కలుస్తుంది. ఆ సమయంలో ఆమెకు తన పూర్వజన్మ పాపం గురించి తెలియదు.

అయినప్పటికీ, సర్వాంగ శోభితుడైన శ్రీకృష్ణుడిని చూసి పులకించిపోయిన మందరా అక్కడే ఆయనను కూర్చోబెట్టి తన చేతులతో ఆయన ఛాతీపై గంధంతో మర్ధన చేస్తుంది. దీంతో పరవశించిపోయిన శ్రీకృష్ణుడు ఆమెకు గూని నుంచి విముక్తి కల్పించడమే కాక ఆమె ముఖానికి కూడా సరికొత్త అందాన్ని ప్రసాదించాడు.

రామాయణ కాలంలో తనకు ఆమె చేసిన చేటు గురించి కృష్ణుడికి తెలియంది కాదు. అయినప్పటికీ తనకు చెడు చేసిన వారిని కూడా ప్రేమించాలనుకునే భగవంతుడు మందరను కూడా అదే దృష్టితో అనుగ్రహిస్తాడు. మనం కూడా భగవంతుని రీతిలోనే మనకు చెడు తలచిన వారికి సైతం మంచి కోరాలన్నదే ఈ కథ సారాంశం.

నమస్కారం!

February 3, 2007

నమస్కారం,

ఈ కాగితం లో మీరు, నా మనసు నుంచి జాలువారె మధురమైన విషయాలను, మరెన్నొ అద్భుతమైన సంగతులను చదవ గలరు, అధి కూడ తెలుగు లొ.

ముందుగ ఒక విషయం, నేను ఇక్కడ వ్రాశే కొన్ని విషయాలు, నేను మరోక చొట చదివినవి కూడ కావచు, నెనే అన్ని స్రుష్టించి నవి కావు.నేను చదివినవి బావున్నాయి అనిపిస్తే అవి మీకు తెలియ జేస్తాను