ఈ మధ్య నెట్ బ్రౌస్ చేస్తుంటే ఈ క్రింది వీడియొ చూశానండి,
(ఆఫ్రికన్ అమెరికన్ గయ్ సింగింగ్ తెలుగు సాంగ్)
అప్పుడు ఈ క్రింది సంగతులు గుర్తుకు వచ్చాయి,
టైప్ చేసే ఓపిక లేక (వికీ నుంచి)….
తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.
అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” (Italian of the east) అని పిలుచుకున్నారు. (నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది. కాబట్టి మనము ఇటాలియనును “తెలుగు ఆఫ్ యూరోపు” అని పిలుచుకోవచ్చు!).
ఇక తెలుగు పై, విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కున్న మక్కువ తెలిసిందే కదా!